కలుపు నివారణ, అంతరకృషి:
కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.
2-3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి.
ఎకరాకు అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలకు) లేదా 1.25 లీ. (బరువు నేలలకు) లేదా పెండిమిదాలిన్ 1.2 లీ. 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి.
మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారి చేస్తే అడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా వుంటుంది.
సి.సి.సి 250 మి.గ్రా. లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మి.గ్రా. లీటరు నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారి చేయవచ్చు.
కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి వేసి, తీగలు పాకించాలి లేని యెడల పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది.
పోట్లలో 2 రోజుల పిందెకు చివర చిన్నరాయిని పురుకోసతో కట్టాలి. లేకుంటే కాయలు మెలి తిరుగుతాయి.
అనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్ళపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి, మంచి మార్కెట్ రేటు లభిస్తుంది.